శుక్రవారం, 28 నవంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-11-2025 శుక్రవారం ఫలితాలు - లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం...

astro4
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు ఉత్సాహంగా శ్రమించండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు సాగవు. వేడుకకు హాజరవుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వాహనదారులకు దూకుడు తగదు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారు. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సమర్థతను చాటుకుంటారు. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ప్రియతములతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. సన్మాన, సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ధృఢసంకల్పంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. లావాదేవీల్లో జాగ్రత్త. ఒత్తిళ్లకు లొంగవద్దు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. రావలసిన ధనం అందుతుంది. చెల్లింపులను అశ్రద్ధ చేయకండి. ప్రియతములతో సంభాషిస్తారు. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. మీ దృష్టి మళ్లించేందుకు కొందరు యత్నిస్తారు. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. నోటీసులు అందుతాయి. చర్చల్లో పాల్గొంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఇరువర్గాలకూ ఆమోదయోగ్యమవుతుంది. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. పనులు చురుకుగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. కీలక పత్రాలు సమయానికి కనిపించవు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు అధికం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ కష్టం వృధా కాదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగండి. ఆప్తులను కలుసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. రావలసిన ధనం అందుతుంది. ధనసహాయం తగదు. కొత్త సమస్యలెదురవుతాయి. పనులు, కార్యక్రమాలు స్వయంగా చూసుకోండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశించిన అవకాశం చేజారిపోతుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. వేడుకకు హాజరవుతారు.