మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఎంతగా కష్టించినా ఫలితం శూన్యం. నిస్తేజానికి లోనవుతారు. మనోధైర్యంతో మెలగండి. ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు, పనులు సాగవు. దంపతుల మధ్య అకారణ కలహం. కీలక సమావేశంలో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆచితూచి అడుగేయండి. భేషజాలకు పోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. ఖర్చులు విపరీతం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆప్తులతో సంభాషిస్తారు. దైవదీక్ష స్వీకరిస్తారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆశయం నెరవేరుతుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొత్త పరిచయాలు బలపడతాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్నివిధాలా యోగదాయకమే. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. కొత్త పనులు చేపడతారు. ఖర్చులు విపరీతం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశయసాధనకు ఓర్పు ప్రధానం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. ప్రముఖులను ఆకట్టుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అధికం. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. భూ సంబంధిత వివాదాలు కొలిక్కివస్తాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ సమస్యలను ఆప్తులకు తెలియజేయండి. పంతాలకు పోవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. పిల్లలకు శుభం జరుగుతుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. శుభకార్యానికి హాజరుకాలేరు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఖర్చులు సామాన్యం. ఏ పనీ చేయబుద్ధికాదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ఖర్చులు విపరీతం. ఆప్తులతో సంభాషిస్తారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణ ఒత్తిడి తొలగుతుంది. మానసికంగా స్థిమితపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు సామాన్యం. ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. ఫోన్ సందేశాలు నమ్మవద్దు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అన్నివిధాలా కలిసివస్తుంది. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. తొందరపడి హామీలివ్వవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. ఒక సమస్య మీకు సానుకూలంగా పరిష్కారమవుతుంది. ఖర్చులు విపరీతం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది.