బుధవారం, 19 నవంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-11-2025 మంగళవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం.. ఆప్తులను కలుసుకుంటారు...

daily astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆలోచనలతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. ఆప్తులను కలుసుకుంటారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. విలువైన వస్తువులు జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. న్యాయనిపుణులను సంప్రదిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు ప్రయోజనకరం. ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యం నిర్ధేశించుకుంటారు. సంకల్పసిద్ధికి పట్టుదలతో శ్రమించాలి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడండి. విమర్శలు పట్టించుకోవద్దు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్నివిధాలా అనుకూలదాయకమే. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసానుకూలతకు లౌక్యం ప్రధానం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసాయం తగదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఏకపక్ష నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా తీసుకోండి. రావలసిన ధనం అందుతుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. మొండిగా పనులు పూర్తి చేస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాల్లో జాగ్రత్త. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. సహాయం ఆశించవద్దు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. కుంభం : 
ధనిష్ట : పూర్వాషాఢ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకున్నది సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు మందుకు సాగవు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. ఖర్చులు సామాన్యం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆప్తులతో సంభాషిస్తారు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.