మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సంప్రదింపులు వాయిదా పడతాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనుల్లో చికాకులు అధికం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. ఖర్చులు అధికం. పొదుపునకు అవకాశం లేదు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దైవకార్యంలో పాల్గొంటారు. మీ చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వాగ్ధాటితో రాణిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు తొలగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనసవర జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. నోటీసులు అందుకుంటారు. చేపట్టిన పనులు సాగవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. సాయం ఆశించవద్దు. ఓర్పుతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య కలహం. ఆప్ముతలతో సంభాషిస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంకల్పం నెరవేరుతుంది. చాకచక్యంగా అడుగులేస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు భారమనిపించవు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనలు, దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ధైర్యంగా అడుగు ముందుకేయండి. పనులు మధ్యలో ఆపివేయవద్దు. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యం నెరవేరుతుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. అసాధ్యమనుకున్న పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు సామాన్యం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు పురమాయించవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. సన్మాన, సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. పురస్కారాలు అందుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు సానుకూలమవుతాయి. వివాదాస్పద వ్యవహారాలు పరిష్కారమవుతాయి. వాహనదారులకు దూకుడు తగదు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రముఖులకు చేరువవుతారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు అధికం, ఆపన్నులకు సాయం అందిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. మనోధైర్యంతో ముందుకు సాగండి. కీలక సమావేశంలో పాల్గొంటారు.