గురువారం, 20 నవంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం 
ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి. ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ శ్రమ మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు సామాన్యం. పనులు అర్థాంతంగా ముగిస్తారు. ఆప్తుల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు అధికం. పొదుపు ధనం గ్రహిస్తారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. అప్రమత్తంగా ఉండాలి. అందరితోను మితంగా సంభాషించండి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
పట్టుదలతో శ్రమిస్తే సత్ఫలితాలుంటాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. ఆదాయ బాగుంటుంది. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. దూరపు బంధువులను కలుసుకుంటారు. చేపట్టిన పనులు సాగవు. సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
మీదైన రంగంలో రాణిస్తారు. ధైర్యంగా యత్నాలు సాగించండి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ధనలాభం ఉంది. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం. రుణవిముక్తులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. కొత్త పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం 
ఆప్తుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. రెట్టించిన ఉత్సాహంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఖర్చులు సామాన్యం. ప్రలోభాలకు లొంగవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. పరిచయస్తుల రాక చికాకుపరుస్తుంది. కార్యక్రమాలు, పనులు సాగవు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
నిర్దేశిత లక్ష్యంతో ముందుకు సాగుతారు. స్థిరాస్తి ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా స్థిమిత పడతారు. ఆప్తులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. పనులు వేగవంతమవుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రయాణం చికాకుపరుస్తుంది.