సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి
శివ మహా పురాణం ప్రకారం సోమ ప్రదోషం రోజు శివ పార్వతులను పూజించడం వల్ల మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. అందునా సోమవారం, ప్రదోషం కలిసి వచ్చిన సోమ ప్రదోషం రోజున చేసే శివ పూజలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి.
సోమ ప్రదోష వ్రతం రోజు శివాలయంలో అన్నదానం చేస్తే మంచిది. ఇంకా వస్త్ర దానం చేస్తే మంచిది. ఆలయంలో బ్రాహ్మణులకు ఎర్రని కందులు దానం ఇస్తే మంచిది. సోమవారం వచ్చే ప్రదోషం రోజున ఉపవాసం చేసేవారు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా పూజ చేయాలి.
రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. కార్తీక మాసం చివరి సోమవారం అయిన నవంబర్ 17న తేదీ ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుని దేవాలయంలో దీపారాధన చేయడం శుభప్రదం. ఈ రోజున దీపదానం, అన్నదానం చేస్తే కోటి సోమవారాలు పూజించిన ఫలితం దక్కుతుంది.
ఈ రోజున పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం చేయించాలి. ప్రదోషం కర్మల నుంచి విముక్తిని ఇస్తుంది. ప్రదోష కాలంలో శివపూజతో శనిదోషాలు తొలగిపోతాయి. సోమవారం వచ్చే ప్రదోషం కావడంతో చంద్ర గ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు.