బుధవారం, 26 నవంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

astro2
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. కొత్తయత్నాలు చేపడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం చేయండి. పనుల సానుకూలమవుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. మానసికంగా స్థిమితపడతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆశించిన పదవి దక్కదు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కలిసివచ్చే సమయం. ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఆప్తులను విందులు, వేడుకలకు ఆహ్వానిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మొండిధైర్యంత యత్నాలు సాగిస్తారు. సన్నిహితులు ప్రోత్సహిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. రోజువారీ ఖర్చులుంటాయి. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఏకపక్ష నిర్ణయం తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. మీ సామర్ధ్యంపై నమ్మకం తగ్గుతుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. అతిగా ఆలోచింపవద్దు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. బెట్టింగ్ జోలికిపోవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. సన్నిహితులకు మీ సమస్యలను తెలియజేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. పట్టుదలకు పోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అనుకోని సంఘటన ఎదురవుతుంది. చేపట్టిన పనులు సాగవు. సోదరులను సంప్రదిస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రముఖులకు సన్నిహితులవుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయం తగదు. సన్నిహితులను సంప్రదించండి. ధన సమస్యలు ఎదురవుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఆదాయం బాగుంటుంది. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు ఒక పట్టాన పూర్తికావు. ప్రతి చిన్న విషయానికీ చికాకుపడతారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ పనితీరు ప్రశంసనీయమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సభ్యత్వం స్వీకరిస్తారు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు.