ఆదివారం, 23 నవంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 22 నవంబరు 2025 (22:10 IST)

నవంబర్ 26 నుంచి 17 ఫిబ్రవరి 2026 వరకూ శుక్ర మౌఢ్యమి, శుభకార్యాలకు బ్రేక్

marriage
ఈ నవంబర్ 26 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 17, 2026 వరకూ శుక్ర మౌఢ్యమి వుంటుంది. కనుక ఈ కాలంలో శుభముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో వివాహాలు, పెళ్లి చూపులు, కొత్త ఇల్లు ప్రారంభం, గృహప్రవేశాలు, వాహనాలను కొనుగోలు చేయడం, పుట్టు వెంట్రుకలు తీయడం, చెవులు కుట్టించడం, నూతన వ్యాపారాలు ప్రారంభించడం, యాత్రలకు వెళ్లడం, చెరువులు తవ్వడం ఇత్యాది కార్యాలను చేయరాదని చెబుతున్నారు.
 
ఐతే నిత్యకర్మలు చేయవచ్చని అంటున్నారు. రోజువారి చేసే ప్రయాణాలు, దైవానికి చేసే నిత్యారాధన, అభిషేకాలు, జపహోమ శాంతులు, నామకరణం, సీమంతం, అన్నప్రాశన, పాత ఇంటికి సంబంధించి మరమ్మతు చేయాల్సి వస్తే ఆ పనులు చేయించడం, నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం వంటివి శుక్రమౌఢ్యమిలో కూడా చేయవచ్చని చెబుతున్నారు.