Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?
అప్పుల బాధ ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక భార్య, భర్త, పదేళ్ల కూతురు ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్, అంబర్ పేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ కుటుంబం ఇంతకు ముందు రామ్‌నగర్‌లో ఉండేది.
కొన్ని నెలల క్రితమే అంబర్‌పేట్‌కు వచ్చారు. ఇటీవల ఆ ఫ్యామిలీలో వాళ్ల పెద్ద కూతురు మరణించింది. ఆపై వారికి ఆర్థిక ఇబ్బందులు కూడా వున్నాయి.
ఈ క్రమంలోనే ఆ కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మీలతో పాటు వాళ్ల కూతురు శ్రావ్యగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.