గురువారం, 27 నవంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-11-2025 గురువారం ఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

astro4
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఖర్చులు విపరీతం. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాలు, వస్తువులు జాగ్రత్త. హాజరవుతారు. బంధువుల ఆతిధ్య ఆకట్టుకుంటుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలను అనుకూలతలుగా మలుచుకుంటారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. దైవదర్శనాలు ఉల్లాసాన్నిస్తాయి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రావలసిన ధనం అందుతుంది. సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఒత్తిడికి గురి కావద్దు. అనుభవజ్ఞులను సంప్రదించండి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. భూ సంబంధిత వివాదాలు సద్దుమణుగుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యవహారాల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఖర్చులు అధికం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ప్రతికూలతలను అధిగమిస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. దైవదర్శనంలో ఒకింత అవస్థలు ఎదుర్కుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీపై ఎదుటి వారికి నమ్మకం కుదురుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. కొందరి మాటలు కష్టమనిపిస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. పనులు చురుకుగా సాగుతాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. అందరితోను మితంగా సంభాషించండి. కొత్తయత్నాలు చేపడతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అన్ని విధాలా యోగదాయకమే. మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య స్వల్ప కలహం.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, విశ్రాంతి లోపం. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అధికం. పనులు ఒక పట్టాన పూర్తి కావు. చీటికిమాటికి చికాకుపడతారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. కష్టపడకుండా ఫలితం ఆశించవద్దు. బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు అధికం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆలయాలకు విరాళాలు సమర్పించుకుంటారు.