గురువారం, 27 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 నవంబరు 2025 (13:34 IST)

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

marriage
మరికొన్ని గంటల్లో జరగాల్సిన వివాహం ఆగిపోయింది. తన మెడలో మూడు ముళ్లు వేయాల్సిన వరుడుని వధువు పిచ్చోడితో పోల్చింది. పదేపదే వేడినీళ్లు కావాలంటూ వరుడు అడుగుతున్నాడని, అతనో పిచ్చోడిలా ఉన్నాడంటూ కామెంట్స్ చేసింది. పైగా, పెళ్లి ఊరేగింపు కూడా ఆలస్యంగా వచ్చిందని, వరుడు బంధువులంతా మద్యం సేవించివున్నారని పేర్కొంది. దీంతో వరుడు కుటుంబీకులు ఆగ్రహించడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. 
 
ఈ కేసులో వరుడు సాప్ట్‌వేర్ ఇంజనీర్. లక్నోలో ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. వివాహ ఆచారాలైన దండలు మార్చుకోవడం, వివాహ ప్రయాణాలు, వివాహ వేడుకలకు ముందే ఈ కలకలం చెలరేగడం గమనార్హం. అలాగే, వరుడు, అతని బంధువులపై వధువు అనేక ఆరోపణలు చేసింది.
 
పెళ్ళి ఊరేగింపు ఆలస్యంగా వచ్చిందని, బంధువులు కొంతమంది తాగి ఉన్నారని వధువు ఆరోపించింది. వరుడు పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడని చెప్పి, అతడు పిచ్చివాడని వధువు అనడంతో గొడవ పెద్దదైంది. టెక్కీ ఇంజనీర్ అయిన తమ కొడుకుని పిచ్చివాడు అని పిలవడంతో వరుడి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. 
 
వివాహ బృందంలోని కొంతమంది సభ్యులు వేదికను వదిలి వెళ్లిపోయారు. పరిస్థితి చేయిదాటిపోవడం, సమాచారం పోలీసులకు చేరడంతో వారు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇరు వర్గాలతో మాట్లాడి ఘర్షణ సద్దుమణిగేలా చేశారు. వివాహ ఖర్చులను తిరిగి ఇచ్చిపుచ్చుకునేందుకు ఇరు కుటుంబ సభ్యులు రాజీకి వచ్చారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగిపోయింది.