Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్
Produced by Kiran Abbavaram, Thimmarajupalli TV
హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
తాజాగా ఈ చిత్ర మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ చేశారు. తిమ్మరాజుపల్లి టీవీ సినిమా ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన ఈ సినిమా కోసం ఛాట్ బస్టర్ సాంగ్స్ చేశారు. తమ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వస్తుందంటూ కిరణ్ అబ్బవరం అనౌన్స్ చేసిన వీడియో ప్రోమో ఆకట్టుకుంటోంది.
నటీనటులు - సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు