OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్
పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓజీ. (దే కాల్ హిమ్ ఓజీ) గురించి ఇటీవల పలు అప్ డేట్స్ చిత్ర టీమ్ అందజేసింది. అమెరికాలో ఈనెల 29న బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు పోస్టర్ల ద్వారా తెలిపారు. అదేవిధంగా ఈనెల 27 చిత్రంలోని సాంగ్ గురించి మరిన్ని వివరాలతో అప్ డేట్ రాబోతోంది. మరోవైపు ఈ సినిమాలో ఓ పాత్రను మెగా కుటుంబానికి చెందిన హీరో చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాయితేజ్ కాంబినేషన్ లో ఓ మూవీ కూడా వచ్చింది.
ఇక సోషల్ మీడియాలో పలు రకాలు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వయస్సులో వుండే పవన్ పాత్రను పోషించారనీ, మెగా హీరోల్లో వరుణ్ తేజ్ మరో పాత్రలో నటించవచ్చని భావిస్తున్నారు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. ఎలాగూ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాన్ పుట్టినరోజు సందర్భంగా మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ వేయనున్నారు. 25న సినిమా విడుదలకానుంది.