శుక్రవారం, 5 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

chiranjeevi birth day celebrations
తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సినీ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. దీంతో తన అన్నయ్యకు తమ్ముడు పవన్ గురువారం బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ ప్రకటన విడులద చేశారు. తన తమ్ముడికి చిరంజీవి ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి. ప్ర‌తీ మాట‌.. ప్ర‌తీ అక్ష‌రం నా హృద‌యాన్ని తాకింది. అన్న‌య్య‌గా న‌న్ను చూసి నువ్వెంత గ‌ర్విస్తున్నావో.. ఓ త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని నేను అంత‌గా ఆస్వాదిస్తున్నాను. నీ కార్య‌దీక్ష‌త‌, ప‌ట్టుద‌ల చూసి ప్ర‌తీ క్ష‌ణం గ‌ర్వ‌ప‌డుతూనే ఉన్నా. నిన్ను న‌మ్మిన‌వాళ్ల‌కు ఏదో చేయాల‌న్న త‌ప‌నే నీకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త శ‌క్తిని ఇస్తుంది. 
 
ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జన‌సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై న‌డిపించు. వాళ్ల ఆశ‌లకు, క‌ల‌ల‌కు కొత్త శ‌క్తినివ్వు. అభిమానుల‌ ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా ల‌భిస్తూనే ఉండాలి. ఓ అన్న‌య్య‌గా నా ఆశీర్వ‌చ‌నాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్ర‌తీ అడుగులోనూ విజ‌యం నిన్ను వ‌రించాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని కోరుకొంటున్నాను" అని చిరంజీవి కోరుకున్నారు.