శనివారం, 23 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2025 (17:32 IST)

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

Gemini Suresh's mother Gemini Subbalakshmi Clap to Gemini Suresh and Akhila Nair
Gemini Suresh's mother Gemini Subbalakshmi Clap to Gemini Suresh and Akhila Nair
జెమిని సురేష్ ముఖ్యపాత్రలో అఖిల నాయర్ తో జంటగా ఆత్మ కథ చిత్రం హైదరాబాద్ లో ప్రారంభమైంది. వారాహి ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్ పై శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మట గాంధీ, బలగం విజయలక్ష్మి, చింటూ ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్టా, నూకరాజు, గుర్రపు విజయ్ కుమార్, సుదర్శన్ రెడ్డి, బాబా శంకర్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి ఎం.వి.గోపి సినిమాటోగ్రఫీ చేస్తుండగా, రాఘవేంద్ర రెడ్డి ఎడిటింగ్ చేస్తున్నారు. సోమేశ్వరరావు నిర్మాతగా రానున్న ఈ చిత్రానికి వారాహి శ్రేయాస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర కథను నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, అలాగే స్క్రిప్ట్ ను జెమిని కిరణ్ చేతుల మీదగా అందుకోగా తొలిగా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జెమిని సురేష్ తల్లి జెమిని సుబ్బలక్ష్మి  ఈ చిత్రానికి తొలి క్లాప్ కొట్టారు.
 
ఈ సందర్భంగా జెమిని సురేష్ మాట్లాడుతూ, ఇది నా తొలి చిత్రం. నా 18 సంవత్సరాల కల నేడు నెరవేడబోతుంది. ఒక మంచి కథతో ప్రేక్షకులు ముందుకు రావాలి అని అనుకున్నాను. ఒక మంచి కథతో నాకు శ్రీనివాస్ ఆత్మకథ చిత్రంతో అవకాశం ఇచ్చారు. నా ఈ చిత్ర పూజ కార్యక్రమానికి నాకు దేవుడు లాంటి వ్యక్తి జెమిని కిరణ్ గారు వచ్చి ఆశీర్వదించినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను.  అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
 
నటి అఖిల మాట్లాడుతూ, అందరూ మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
 
సీనియర్ నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ, ఈ చిత్రంలో నా పాత్ర ఎంతో కీలకం. ఇటీవల కాలంలో ఇటువంటి చిత్రం రాలేదు. మరొకసారి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను" అన్నారు.
 
దర్శకులు శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ, నేను ఇప్పటికే ఒక హిందీ సినిమాకు, నాలుగు కన్నడ చిత్రాలకి అలాగే ఒక తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించాను. కథని హీరోగా అనుకుని ఆత్మకథ అనే చిత్రాన్ని రచించాను. ఈ చిత్రంలో జెమిని సురేష్, సమ్మటి గాంధీ రెండు స్తంభాలు. నన్ను నమ్మి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు అనుకుంటున్నాను. అలాగే శ్రేయాస్ ను అతి చిన్న వయసులోనే సంగీత దర్శకునిగా తీసుకోవడానికి కారణం అతని టాలెంట్ అన్నారు.
 
సంగీత దర్శకులు శ్రేయాస్ మాట్లాడుతూ... "నా పేరు శ్రేయాస్. గ్రేడ్ 6 చదువుతున్నాను. నేను ఇప్పటికే ఐదు ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తున్నాను. ఎన్నో సంగీత కోర్సులు కూడా నేర్చుకున్నాను. చిత్ర బృందం అందరికీ థాంక్స్" అన్నారు.
 
తారాగణం:జెమిని సురేష్, అఖిలా నాయర్, సమ్మేట గాంధీ, బలగం విజయలక్ష్మి, చిన్ను, ధనరాజ్, తగుబోతు రమేష్, మహేశ్ విట్ట, నూకరాజు, గుర్రపు విజయ్ కుమార్, డి. సుదర్శన్ రెడ్డి, బాబా శంకర్