శుక్రవారం, 22 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 21 ఆగస్టు 2025 (23:27 IST)

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

FreeStyle Libre 2 Plus
అబోట్, గ్లోబల్ హెల్త్కేర్ కంపెనీ ఈ రోజు ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్ సెన్సార్ను ప్రారంభించినట్లు ప్రకటించింది, ఇది ఫ్రీస్టైల్ లిబ్రే పోర్ట్‌ఫోలియోలో తాజా ఆవిష్కరణగా నిలిచే ఈ పరికరం, ప్రతి నిమిషం వినియోగదారుడి స్మార్ట్‌ఫోన్‌కు నేరుగా ఆటోమేటిక్ గ్లూకోజ్ రీడింగులను అందిస్తుంది. దీని ద్వారా డయాబెటిస్ ఉన్న వ్యక్తులు తమ పరిస్థితిని మరింత విశ్వాసం, ఖచ్చితత్వం, సులభతతో నియంత్రించగలరు. ఇకపై స్కాన్ చేయకుండా గ్లూకోజ్ రీడింగులు వీక్షించే సౌకర్యంతో పాటు, తక్కువ లేదా అధిక గ్లూకోజ్ స్థాయిలు2 గుర్తించినప్పుడు వినియోగదారుల స్మార్ట్‌ఫోన్‌లకు  తక్షణ హెచ్చరికలు చేరతాయి. ఈ విధంగా, వారు సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి మరింత శక్తివంతమవుతారు.
 
భారతదేశంలో ప్రస్తుతం 101 మిలియన్ల మంది డయాబెటిస్‌తో జీవిస్తున్నారు, దీని వల్ల దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద డయాబెటిస్ జనాభా కలిగిన దేశంగా నిలుస్తోంది. ఈ ఆందోళనకర గణాంకం, డయాబెటిస్ ఉన్న వ్యక్తులు తమ పరిస్థితిని మరింత విశ్వాసంతో, ముందస్తు జాగ్రత్తలతో నిర్వహించేందుకు నిరంతర గ్లూకోజ్ మానిటర్లు (CGMs) వంటి అందుబాటులో ఉండే, నిజ-సమయ పరిష్కారాల అత్యవసర అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. గ్లూకోజ్ స్థాయిల పర్యవేక్షణ, తగిన చికిత్సతో కలిపి, డయాబెటిస్‌ను సమర్థంగా నియంత్రించడంలో, దీర్ఘకాలిక సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
 
అబోట్ మార్గదర్శక ఫ్రీస్టైల్ లిబ్రే సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఏడు మిలియన్లకు పైగా డయాబెటిస్ ఉన్న వ్యక్తుల పరిస్థితి నిర్వహణను మార్చింది. ఈ జీవితాన్ని మార్చే ఆవిష్కరణను భారతదేశానికి పరిచయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇది ప్రజలను వారి పరిస్థితిని మెరుగ్గా నియంత్రించడానికి శక్తివంతం చేసే అపారమైన సామర్థ్యాన్ని కలిగింది, అని డాక్టర్ కెన్నెత్ లీ, ప్రాంతీయ వైద్య వ్యవహారాల డైరెక్టర్, ఏషియా పసిఫిక్, డయాబెటిస్ డివిజన్, అబోట్ అన్నారు. ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్ పనితీరు, ఖచ్చితత్వ ప్రమాణాల ప్రకారం, అన్ని రోగుల జనాభా, గ్లైసెమిక్ స్థాయిల కోసం నమ్మదగిన గ్లూకోజ్ రీడింగులను అందిస్తుంది. ఇది వినియోగదారులకు సులభంగా గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షించే స్వేచ్ఛని ఇస్తుంది, తద్వారా వారు మరింత సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
 
ఫ్రీస్టైల్ లిబ్రే టెక్నాలజీ తక్కువ రక్తంలో చక్కెర ఎపిసోడ్లను 43 శాతం వరకు తగ్గిస్తుంది, HbA1c స్థాయిలను  0.9 శాతం నుంచి 1.5 శాతం వరకు సవరించగలదు, ఆసుపత్రి సందర్శనలను 66 శాతం తగ్గించగలదని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ప్రత్యేకంగా, టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో తీవ్రమైన హైపోగ్లైసీమియా సమస్యలను ఎదుర్కొంటున్నవారిలో 78 శాతం వరకు హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ చికిత్స తీసుకుంటున్న టైప్ 2 డయాబెటిస్ రోగులలో 44 శాతం వరకు స్ట్రోక్, ఇతర డయాబెటిస్-సంబంధిత ఆసుపత్రి ప్రవేశాల ప్రమాదం తగ్గుతుంది. ఇంకా, నిజ-సమయ హెచ్చరికలు సంరక్షకులకు మనశ్శాంతిని ఇస్తూ, పరిస్థితులు తీవ్రతరం అవ్వకముందే చర్య తీసుకునే అవకాశాన్ని అందిస్తాయి.
 
ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్ ఎలా పనిచేస్తుంది
ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్ నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్(NFC), బ్లూటూత్ టెక్నాలజీతో పనిచేస్తుంది, ఐచ్ఛిక అలార్లను సపోర్ట్ చేస్తూ వినియోగదారుల అనుకూల స్మార్ట్ఫోన్‌లో నిరంతర గ్లూకోజ్ డేటాను అందిస్తుంది. సెన్సార్‌ను చేయి వెనుక భాగంలో 15 రోజులు ధరించవచ్చు. అనుకూల స్మార్ట్‌ఫోన్ ద్వారా త్వరిత స్కాన్ ద్వారా సక్రియం చేయవచ్చు. డయాబెటిస్ ఉన్న వ్యక్తులు ప్రతి నిమిషానికి నిజ-సమయ గ్లూకోజ్ రీడింగులు, హిస్టరీ డేటా, నమూనాలు, గ్లూకోజ్ ట్రెండ్‌లను ఫింగర్‌స్టిక్ లేకుండానే చూడగలుగుతారు. తల్లిదండ్రులు, సంరక్షకులు కూడా స్వయంచాలకంగా గ్లూకోజ్ రీడింగులను పొందగలుగుతారు, మరింత మనశ్శాంతి1 కోసం అనుకూల అలార్లను సెట్ చేయవచ్చు. ఇక, ఫ్రీస్టైల్ లిబ్రె లింక్ ద్వారా వ్యక్తులు తమ ఆరోగ్య సంరక్షణ నిపుణులు, తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో డేటాను పంచుకోవచ్చు. లిబ్రే వ్యూ ఒక సురక్షిత, క్లౌడ్ ఆధారిత డయాబెటిస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఇది రోగులకు వారి గ్లూకోజ్ డేటాను వైద్యునితో సురక్షితంగా పంచుకోవడానికి అవకాశం ఇస్తుంది. లిబ్రెలింక్అప్ అనేది తల్లిదండ్రులు, సంరక్షకుల కోసం ఒక మొబైల్ అనువర్తనం, ఇది పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు లేదా డయాబెటిస్‌ను నిర్వహించే ప్రియమైనవారి గ్లూకోజ్ చరిత్ర, పోకడలను సులభంగా తనిఖీ చేయడానికి వీలు కల్పిస్తుంది.
 
నేను ఎల్లప్పుడూ టెక్నాలజీని నమ్ముతాను. కానీ నా అత్తగారు డయాబెటిస్తో బాధపడుతున్నప్పుడు సరైన సాధనాలు చాల ప్రయోజనం చేకూరుస్తాయనే విషయం నాకు నిజంగా అర్థం కాలేదు. ముఖ్యంగా రాత్రిపూట లేదా ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం గురించి మేము నిరంతరం ఆందోళన చెందేవాళ్ళం, అని నటి, ఇన్ఫ్లుయెన్సర్ సమీరా రెడ్డి చెప్పారు. ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్ వాడటం ద్వారా అంతా మారిపోయింది. నిజ-సమయ ఖచ్చితమైన రీడింగులు, హెచ్చరికలు, ట్రెండ్‌లను ట్రాక్ చేయగల సామర్థ్యం, ఇవి మాకు మళ్లీ నియంత్రణ అనుభూతిని ఇచ్చాయి. నేను పని కోసం దూరంగా ఉన్నా ఆమె బాగానే ఉందని తెలుసుకోవచ్చు. ఆమె ఎక్కువ ధైర్యంగా, మరింత స్వతంత్రంగా అనుభూతి చెందుతుంది. ఇలాంటి భరోసా అమూల్యమైనది. ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్ ఇప్పుడు భారతదేశం అంతటా పెద్దలు, 2, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, గర్భధారణ మధుమేహం ఉన్న మహిళలకు కూడా అందుబాటులో ఉంది.