టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది
మహబూబ్ నగర్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. టీవీ సీరియల్ చూస్తున్న భార్యను తనకు అన్నం పెట్టాలంటూ భర్త గట్టిగా అడిగాడు. అంతే... ఆమె ఆత్మహత్య యత్నం చేసింది.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కోడిపుంజుల తండాలో కూలీ పనులు చేసుకుంటూ వుండే వ్యక్తి శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చాడు. రాగానే తనకు భోజనం పెట్టాలంటూ భార్యను అడిగాడు. ఐనా ఆమె భర్త మాటలు పట్టించుకోకుండా టీవీ సీరియల్ చూడటంలో మునిగిపోయింది. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త... నీకు టీవీ సీరియల్ ముఖ్యమా నేను ముఖ్యమా అంటూ గట్టిగా ప్రశ్నించాడు.
అంతే... భర్త తనపై ఆగ్రహించాడనీ, టీవీ సీరియల్ చూడవద్దంటున్నాడని ఆగ్రహంతో తన కుమారుడికి పురుగులు మందు తాగించి భార్య కూడా తాగేసింది. విషయం తెలుసుకున్న భర్త ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించాడు. కుమారుడి పరిస్థితి విషమంగా వుండగా భార్య పరిస్థితి కూడా ఆందోళకరంగా వున్నట్లు తెలిపాడు.