మంగళవారం, 4 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 నవంబరు 2025 (13:13 IST)

వరల్డ్ కప్ గెలుచుకున్న ఆ క్షణాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాం.. నారా బ్రాహ్మణి (video)

Nara Bramhani
Nara Bramhani
ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు, పలువురు భారత క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ కూడా నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియానికి వెళ్లారు. 
 
నారా లోకేష్‌తో పాటు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ కూడా ఉన్నారు. ఈ సందర్బంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌‌ను కూడా లోకేష్ ఫ్యామిలీ కలిసింది. ఈ సందర్భంగా సచిన్‌తో దిగిన ఫొటోలను కూడా లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
అలాగే నారా బ్రాహ్మణి కూడా మహిళల క్రికెట్ జట్టు టైటిల్ గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. తన కుమారుడు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఎంజాయ్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. 
 
భారత మహిళా క్రికెట్ జట్టు కీర్తి శిఖరాలకు చేరుకున్నప్పుడు డివై పాటిల్ స్టేడియంలో దేవాన్ష్, నారా లోకేష్, తాను ఆ ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయామని.. ఇది తమకు జీవితకాల జ్ఞాపకంగా నిలిచినందుకు
 భారత క్రికెట్ జట్టుకు బ్రాహ్మణి ధన్యవాదాలు తెలిపారు.