శుక్రవారం, 31 అక్టోబరు 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 అక్టోబరు 2025 (10:56 IST)

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

image
షార్లెట్: అమెరికాలో తెలుగు జాతి కోసం నిరంతరం సేవలు అందిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం క్రమంగా అమెరికాలో అన్ని నగరాలకు విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నార్త్ కరోలైనా లోని షార్లెట్‌లో నాట్స్ చాప్టర్ ప్రారంభించింది. షార్లెట్ నగరంలో దాదాపు 1000 మంది తెలుగువారు  ఈ కార్యక్రమంలో పాల్గొని నాట్స్ వెంటే మేము అని మద్దతు ప్రకటించారు. తెలుగు వారికి అమెరికాలో ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా ఉంటుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. షార్లెట్ నాట్స్ నాయకులు షార్లెట్‌లో తెలుగు వారి కోసం మంచి కార్యక్రమాలు చేపట్టి నాట్స్ ప్రతిష్టను మరింత పెంచాలని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అన్నారు.
 
సాటి తెలుగువారి కోసం మన వంతు సాయం చేయడం కోసమే నాట్స్ ఉందని, తెలుగువారిని కలపడంలో.. తెలుగువారికి అండగా నిలవడంలో నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ రమణ మూర్తి గులివందల అన్నారు. నాట్స్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాట్స్ షార్లెట్‌ చాప్టర్‌కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకటరావు దగ్గుబాటి అన్నారు.
 
అలాగే రాలీ ప్రాంతం నుంచి ఉమా నార్నె, భాను నిజాంపట్నం, కల్పనా అధికారి నాట్స్ షార్లెట్ చాప్టర్‌ ప్రారంభానికి హాజరై షార్లెట్ చాప్టర్ నాయకులను ప్రోత్సాహమిచ్చారు. నాట్స్ జాతీయ నాయకులు నాట్స్ షార్లెట్ చాప్టర్ నాయకులను సభా ముఖంగా అందరికి పరిచయం చేశారు. చాప్టర్ లాంచ్ సందర్భంగా 200 మంది బాలబాలికలతో బాలల సంబరాలు కూడా నిర్వహించారు. అనేక విభాగాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందచేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది పాల్గొన్నారు.
 
నాట్స్ షార్లెట్ చాప్టర్ నాయకత్వ వివరాలు ఇవే.. 
దీపిక సయ్యాపరాజు – చాప్టర్ కోఆర్డినేటర్
పల్లవి అప్పాణి – జాయింట్ కోఆర్డినేటర్
వినీలా దొప్పలపూడి – ఈవెంట్స్
ప్రవీణ పాకలపాటి – మహిళా సాధికారత
వెంకట్ యలమంచిలి – ఖజాంచి
లక్ష్మీ బిజ్జల – జాయింట్ ఖజాంచి
సిద్ధార్థ చాగంటి – క్రీడలు
సుమ జుజ్జూరు – సోషల్ మీడియా