శుక్రవారం, 31 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 అక్టోబరు 2025 (19:40 IST)

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

Begger
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిక్షాటన నివారణ చట్టం 2025ను అధికారికంగా అమల్లోకి తీసుకుని వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిక్షాటన చేస్తూ ఎవరూ కనిపించరాదు. అలా చేస్తే వారిని పునరావాస కేంద్రాలకు తీసుకుని వెళ్తారు. కాగా ఈ చట్టానికి రాష్ట్ర గవర్నర్ ఈ నెల 15న ఆమోద ముద్ర వేసారు. దీంతో ఈ నెల 27న జీవో జారీ చేయగా న్యాయశాఖ సెక్రటరీ ప్రతిభాదేవి జీవో ఎంఎస్ నె.58ని విడుదల చేసారు.
 
రాష్ట్రంలో భిక్షాటన మాఫియాను అడ్డుకోవడమే కాకుండా భిక్షాటనను పూర్తిగా నిర్మూలించి నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న ధ్యేయంతో ఈ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు. మరి రాష్ట్రంలో వున్న భిక్షగాళ్లను ఎలా అడ్డుకుంటారో చూడాల్సి వుంది.