గురువారం, 30 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2025 (17:59 IST)

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

Mahakali, Bhumi Shetty Look
Mahakali, Bhumi Shetty Look
హనుమాన్ సినిమాతో సూపర్ హీరో జానర్‌ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళిన విజనరీ ఫిల్మ్ మేకర్ ప్రసాంత్ వర్మ, RKD స్టూడియోస్ తో కలసి మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. వారి కొత్త చిత్రం మహాకాళి నుంచి లీడ్ ఫేస్‌ను పరిచయం చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో భూమి శెట్టి ప్రధాన పాత్రలో కనిపించగా, ఆమె లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
 
ఈ సినిమా ఇప్పటికే 50%కు పైగా షూట్ పూర్తిచేసుకుంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‌పై ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. సాధారణంగా నాన్-స్టార్ సినిమాలకు ఇంత భారీ బడ్జెట్ వెచ్చించేందుకు ప్రొడ్యూసర్లు వెనుకాడుతారు. కానీ మహాకాళి టీమ్ మాత్రం ఈ సాహసాన్ని చేసి చూపింది. పలువురు ఏ లిస్టు నటీమణులు సూపర్ హీరో పాత్రను పోషించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినప్పటికీ, కథ సారాన్ని నిజంగా ప్రతిబింబించగల కొత్త ముఖం కావాలనే నిశ్చయంతో ఆ పాత్రకు సరిపడే డార్క్ స్కిన్ టోన్, వ్యక్తిత్వం, అన్నిరకాలుగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే భూమి శెట్టిని ఎంపిక చేశారు.  
 
మహాకాళి ఇంటెన్స్, డివైన్ ఫస్ట్ ఫస్ట్ లుక్ ఇన్స్టంట్ గా హిట్ అయ్యింది. ఫస్ట్ లుక్‌లో భూమి శెట్టి ఎరుపు, బంగారు వర్ణంలో ఆగ్రహం, కరుణ రెండింటినీ ప్రతిబింబించే దివ్యమైన ఆరాతో మెరిసింది. సాంప్రదాయ ఆభరణాలు, పవిత్ర చిహ్నాలతో అలంకరించబడిన ఆమె చూపు, సృష్టి-ప్రళయం, విధ్వంసం-పునర్జన్మ శక్తిని సూచిస్తోంది.
 
ఈ పోస్టర్‌తో మహాకాళి చిత్రం ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్‌లోని (PVCU) మరో అద్భుత అధ్యాయమని స్పష్టమవుతోంది. “From the Universe of HanuMan” అనే ట్యాగ్‌లైన్ ఈ కథ హనుమాన్‌తో అనుసంధానమై ఉన్నదనే సంకేతాన్ని ఇస్తోంది.   భారతీయ పౌరాణిక సూపర్ హీరో యూనివర్స్‌కి ఇది మరో మెట్టు అవుతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
 
ఆర్ఎకే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్, పూజ కొల్లూరు దర్శకత్వం కలసి గ్రేట్ విజువల్ వండర్‌ను అందించబోతున్నాయి.