శుక్రవారం, 31 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2025 (19:09 IST)

YouTube వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీ, ఉద్యోగం వదిలేసేవారికి రెడ్ కార్పెట్

Youtube office
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
AI దెబ్బకి ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇది మరీ ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లేఆఫ్‌లు సాగుతూనే వున్నాయి. ఫలితంగా సుమారు 80,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా వీరి దారిలోనే యూ ట్యూబ్ కూడా పయనించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. 
 
ఐతే ఎవర్నీ బలవంతంగా వెళ్లమనడంలేదట. కంపెనీ విడిచి వెళ్లే వారి కోసం... అదికూడా అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీలను ఆఫర్ చేసింది. కృత్రిమ మేథ దూసుకు వస్తున్న నేపధ్యంలో యూ ట్యూబ్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ క్రమంలో ఆ కంపెనీ సీఈఓ ఈ మేరకు ప్రకటన చేసారు. కృత్రిమ మేథను ఉపయోగించుకునేందుకు మార్పులు సహజమని ఆయన వెల్లడించారు.