సోమవారం, 27 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 అక్టోబరు 2025 (15:44 IST)

Google: గూగుల్ చెల్సియా కార్యాలయంలో నల్లుల బెడద.. అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్

Bed Bug
Bed Bug
న్యూయార్క్ నగరంలోని టెక్ దిగ్గజం గూగుల్ చెల్సియా కార్యాలయాన్ని నల్లులు ముట్టడించాయని చెప్పాలి. దీనితో యాజమాన్యం తాత్కాలికంగా ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని కోరింది. చెల్సియా కార్యాలయంలో నల్లుల బెడద పెరిగిపోవడంతో ఉద్యోగులు నానా తంటాలు పడుతున్నారు. వాటిని నిర్మూలించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. 
 
19-20 అక్టోబర్ 2025న, గూగుల్ పర్యావరణ, ఆరోగ్యం, భద్రతా బృందం నల్లులు చెల్సియా కార్యాలయంలో తిరుగుతున్నాయని అంతర్గత ఇమెయిల్ ద్వారా సిబ్బందికి తెలియజేసింది. బెడ్ బగ్స్ ఎక్స్పోజర్ లేదా తెగుళ్ళను చూసినట్లైతే బృందానికి నివేదించాలని అంతర్గత ఇమెయిల్ ఉద్యోగులను కోరింది.
 
ఇంట్లో బెడ్ బగ్స్ కనిపిస్తే ప్రొఫెషనల్ ఎక్స్‌టెర్మినేటర్లను సంప్రదించాలని టెక్ దిగ్గజం సిబ్బందికి సూచించింది. నల్లులు కొరికి ఇబ్బందికి గురై.. చికిత్స తీసుకుంటున్నట్లైతే.. ఆ చికిత్స పూర్తయ్యే వరకు సిబ్బంది కార్యాలయానికి రావద్దని కోరారు. సోమవారం ఉదయం నాటికి, ఉద్యోగులు తిరిగి రావడానికి అనుమతి లభించింది.
 
గూగుల్ బెడ్‌బగ్ ఇన్ఫెస్టేషన్‌ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. 2010లో, మాన్‌హట్టన్‌లోని దాని 9వ అవెన్యూ కార్యాలయాలు నగరవ్యాప్తంగా విస్తృత వ్యాప్తి మధ్య ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాయి.