Googleకి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)
దేశంలో ఐటీ అంటే బెంగళూరు అనేది చాలామంది చెప్పే మాట. ఐతే Google AI డేటా సెంటర్ Vizagకి వస్తుందనగానే కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ మల్లికార్జున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అక్కసు వెళ్లగక్కారు. ఆయన మాట్లాడుతూ... డేటా సెంటర్లకు భారీగా విద్యుత్, నీరు అవసరం అవుతంది. ఏపీ ప్రభుత్వం గూగుల్ డేటా కేంద్రానికి ఉచితంగా భూములు, విద్యుత్, నీరు అందిస్తుంది. ఏటా గూగుల్ సంస్థకి 22 వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రాలు ఇంత భారీగా ప్రైవేటు కంపెనీలకు సబ్సిడీలు ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. ఏపీ ఎలా ఇచ్చిందో కానీ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి ప్రోత్సహకాలు ఇచ్చే స్థాయిలో లేదు. ఇలాంటి లెక్కలన్నీ వాళ్లు చెప్పరు. గూగుల్ వచ్చిందని మాత్రమే చెబుతారు. అన్ని రాయితీలు మేము ఇస్తే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని మమ్మల్ని అంటారు కదా.
అంతేకాగు బెంగళూరులో జనావాసం ఎక్కువవుతుందని అంటున్నారు, మరి ఏపీ నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తే జనావాసం ఎక్కువ అవుతుంది కదా. అమరావతికి మోడీ 10 వేల కోట్లు ఇచ్చారు. అసలు భాజపా ఎంపీలు ఏం చేస్తున్నట్లు అంటూ తన అక్కసును వెళ్లగక్కారు.