శనివారం, 22 నవంబరు 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2025 (15:07 IST)

నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో అరుదైన గౌరవం.. ధోనీ, అభినవ్ బింద్రాల తర్వాత?

Neeraj Chopra
Neeraj Chopra
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో ప్రతిష్టాత్మక గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. భారత రక్షణ మంత్రి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తదితరుల సమక్షంలో ఈ ఉన్నత గౌరవాన్ని నీరజ్ చోప్రా అందుకున్నారు. ఈ హోదా టెరిటోరియల్ ఆర్మీలో వర్తిస్తుంది. 
 
ఇది సాధారణ సైన్యానికి మద్దతుగా పనిచేస్తుంది. హర్యానాలోని పానిపట్ జిల్లాకు చెందిన నీరజ్ చోప్రా 2016లోనే భారత సైన్యంలో నాయబ్ సుబేదార్‌గా చేరారు. అప్పటి నుండి ఆయన ఒకవైపు సైనిక బాధ్యతలను, మరోవైపు అథ్లెటిక్స్ శిక్షణను సమన్వయం చేసుకుంటూ వచ్చారు. 
 
ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను పొందడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  ఈ గౌరవ హోదా పొందిన వారిలో ఎం.ఎస్. ధోని (క్రికెట్), అభినవ్ బింద్రా (షూటింగ్) వంటి ఇతర ప్రముఖ క్రీడాకారులు కూడా ఉన్నారు.