పాడు కుక్క తెల్లార్లూ మొరుగుతూ నిద్ర లేకుండా చేసింది, అందుకే చంపేసా (video)  
                                       
                  
				  				  
				   
                  				  బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. నగరంలో ఎంబీఎ చదువుతున్న రుషిక అనే విద్యార్థిని తన పెంపుడు కుక్కలను సంరక్షించేందుకు ఓ పని మనిషిని మాట్లాడుకుంది. ఆమెకి వుండేందుకు ఇంటితో పాటు నెలకి రూ.23 వేల జీతం కూడా ఇస్తానన చెప్పింది. అన్నింటికి అంగీకరించిన సదరు పనిమనిషి పుష్పలత కుక్కల పట్ల కర్కశంగా ప్రవర్తించింది.
				  											
																													
									  
	 
	ఉదయాన్నే రెండు కుక్కల్ని వాకింగుకు తీసుకెళ్లేందుకు లిఫ్టులో ఎక్కింది. ఐతే రెండింటిలో ఓ కుక్కను లిఫ్టులోనే కుక్కను పైకి కిందకు తాడు పట్టుకుని వేలాడదీస్తూ నేలకేసి కొట్టింది. దాంతో ఆ కుక్క అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కుక్క చనిపోవడంతో దాన్ని తాడుతో అలాగే లాక్కెళ్లింది. ఇంట్లోకి వెళ్లి కుక్క గిలగిల తన్నుకుంటూ దానికదే కిందపడి చనిపోయిందంటూ అబద్ధం చెప్పింది.
				  
	 
	ఐతే ఆమె వాలకం చూసిన రుషిక లిఫ్టులో వున్న సీసీ కెమేరాలను పరిశీలించగా ఘోరం వెలుగు చూసింది. దీనితో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్ట్ చేసారు. దర్యాప్తులో పుష్పలతను విచారించగా... ఆ కుక్కలతో విసుగు చెందాననీ, అవి రాత్రంతా మొరుగుతూ తనకు కంటి మీద కునుకు లేకుండా చేసాయని, అందువల్లే దాన్ని చంపేసానంటూ వెల్లడించింది.