శుక్రవారం, 28 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 27 నవంబరు 2025 (16:51 IST)

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Srivishnu Clap to Naresh Agastya, Shreya Rukmini
Srivishnu Clap to Naresh Agastya, Shreya Rukmini
నరేష్ అగస్త్య హీరోగా చైతన్య గండికోట దర్శకత్వంలో డా.ఎం రాజేంద్ర నిర్మాణంలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. శ్రేయ రుక్మిణి హీరోయిన్ గా నటిస్తున్నారు. GENIE ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందుతున్న కొత్త చిత్రం ఈరోజు పూజాకార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయ్యింది.
 
గ్రాండ్ గా జరిగిన ముహూర్త కార్యక్రమంలో మాజీ IAS సునీల్ శర్మ, అతని భార్య షాలిని శర్మ మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు. హీరో శ్రీవిష్ణు క్లాప్ కొట్టారు. రఘుబాబు కెమరా స్విచాన్ చేయగా, డైరెక్టర్ బి. గోపాల్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పలువురు ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. విద్యాసాగర్ చింతా డీవోపీగా పని చేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు.
 
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రానికి సంబధించిన ఇతరనటీనటులు వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.