1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 22 జులై 2025 (16:47 IST)

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా సినిమా గుర్రం పాపిరెడ్డి నుంచి యోగిబాబు పోస్టర్

Gurram Papireddy -Yogi Babu
Gurram Papireddy -Yogi Babu
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ)  నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో "గుర్రం పాపిరెడ్డి" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
 
ఈ రోజు "గుర్రం పాపిరెడ్డి" సినిమా నుంచి ప్రముఖ నటుడు యోగిబాబుకు బర్త్ డే విశెస్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో యోగిబాబు ఉడ్రాజు అనే పాత్రలో సందడి చేయబోతున్నారు. ఆయన పర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. పర్పెక్ట్ డార్క్ కామెడీ మూవీగా "గుర్రం పాపిరెడ్డి" సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో డిఫరెంట్ గా డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ను హైదరాబాద్ సిటీ బ్యాక్ డ్రాప్ లో కాంటెంపరరీగా,  స్టైలిష్ గా ప్రెజెంట్ చేస్తున్నారు దర్శకుడు మురళీ మనోహర్. 
 
నటీనటులు - నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్, తదితరులు