బుధవారం, 26 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2025 (14:24 IST)

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

jogi ramesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని తయారు చేసిన కేసులో మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్‌కు విజయవాడ ఎక్సైజ్ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో ఆయనతో సహా మరో మరో ఆరుగురు నిందితులు కూడా ఉన్నారు. వీరందరికీ కోర్టు రిమాండ్ పొడగించింది. ఈ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, సన్నిహితుడు అద్దేపల్లి జనార్ధన్ రావుతో పాటు మరో నలుగురు నిందితులుగా ఉన్నారు. 
 
వీరందరికీ గతంలో విధించిన రిమాండ్ మంగళవారంతో ముగిసింది. దీంతో వీరిని మంగళవారం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరచగా, వీరికి రిమాండ్‍ను డిసెంబరు 9వ తేదీ వరకు పొడగిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, ఏపీలో ఈ నకిలీ మద్యం తయారీ కేసు సంచనలనంగా మారిన విషయం తెల్సిందే. గత వైకాపా ప్రభుత్వంలో చిన్నపాటి కుటీరపరిశ్రమగా ప్రారంభమైంది. అనతికాలంలోనే భారీ మొత్తంలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ కోట్లాది రూపాయలను అక్రమంగా అర్జించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఈ నకిలీ మద్యం తయారీ కేసు వెలుగు చూడటంతో పలువురుని ఏపీ ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.