గురువారం, 27 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2025 (18:10 IST)

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

Anantha Sriram
Anantha Sriram
పాట రాసేవాడు చిత్రంలో నటించే నటీనటులకు తెలీయకపోవచ్చు. ఇది వరకు ఆడియో కేసెట్ లో గీత రయిత ఫొటో ముద్రించేవారు. రాను రాను ఆ కల్చర్ పోయింది.  రచయిత పేరు చూసుకోవాలనుకుంటు చాలా కష్టమైన పని. అందుకే టీవీలో ఈ మధ్య హోస్ట్ గా వెళ్ళాక ఏదో మాట్లాడితే సరిపోదు. ట్రెండ్ ను బట్టి ఉత్సాహంతో వున్న వారిని జనాలు ఇష్టపడుతున్నారు. అందుకే నేను టీవీ ప్రోగ్రామ్ లో వుంటే డాన్స్  కూడా చేసేవాడిని. యాక్షన్ పరంగా జంప్ లు చేసేవాడిని. ఎందుకంటే ఆ పాట నేను రాసిందే మ్యూజిక్ రాగానే అలా చేయడం వల్ల నేను రచయితను అని తెలిసేది. అప్ డేట్ అవటన్నమాట.
 
పాటలపరంగా అవగాహవున్న దర్శకులు కొద్దిమందే వున్నారు. రాజమౌళి సినిమాకు పాట రాయాలంటే పద వరస ఇలానే వుండాలి. ఈ చరణంలో ఈ పదాలుండాలి అంటూ చెప్పేవారు. అలాంటి వారు కొద్దిమంది దర్శకులున్నాయి. సందీప్ రెడ్డి వంగా, సాయి రాజేష్ వంటి వారు వున్నారు.
 
పారితోషికం గురించి చెప్పాటంటే.. మర్యాద రామన్న కు కీరవాణిగారు ఓ మాట అన్నారు. రాజమౌళి సినిమా అనికాదు. తక్కువ బడ్జెట్ సినిమా అనుకుని తీసుకో అన్నారు. అయితే పాటకు ఎంత ఇవ్వమంటారు అని అడిగారు. 35వేలు అడిగాను. వెంటనే ఆయన 72 వేలు ఇచ్చారు. అలాగే ఈగ సినిమాకు పాట రాయాలంటే ఎంత ఇవ్వమంటారు అని అడిగారు. అంతకుముందు 72 వేలు ఇచ్చారు గదా.. దానికి కొంచెం ఎక్కువ అడిగాను... దానికి కీరవాణి గారు లక్ష రూపాయలకు నువ్వు ఎదగాలని ఇస్తున్నా అని అందజేశారు.  ఆ తర్వాత  ఓ పెద్ద సంస్థ పాట రాయమంటే వెళ్ళాను. పారితోషికం అడిగితే.. లక్ష అని చెప్పాను. ఆయన ఆలోచించి.. 35వేలు తీసుకోమన్నారు. వెంటనే వద్దులేండి అని లేచి వచ్చేశాను అంటూ తన మనసులోని మాటను ఆవిష్కరించారు.