ఆదివారం, 23 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

spirit movie launch
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ప్రకటించిన చిత్రం 'స్పిరిట్‌'. ఎప్పటి నుంచో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఆదివారం మొదలైంది. ప్రారంభోత్సవానికి ప్రముఖ నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ సినిమాని ఎప్పుడో అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. సెట్స్‌పైకి వెళ్లడం ఆలస్యమవుతూ వచ్చింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, వివేక్‌ ఒబెరాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
ఈ చిత్రాన్ని భారతీయ భాషలతోపాటు జపనీస్‌, కొరియన్‌, మాండరిన్‌లో విడుదల చేయనున్నారు. విజువల్స్‌ లేకుండా కేవలం ఆడియోతో క్రియేట్‌ చేసిన 'స్పిరిట్‌' టీజర్‌ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. టి- సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లలో ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడు.