ఆదివారం, 23 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 నవంబరు 2025 (15:04 IST)

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

prashanth kishore
ఎక్కడో తప్పు జరిగిందని, అందువల్ల తమ పార్టీకి చెందిన కమిటీలన్నింటిని రద్దు చేస్తున్నట్టు జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆరోపించారు. అయితే దీన్ని నిరూపించేందుకు తన వద్ద ఎలాంటి ఆధారాలే లేవన్నారు. 
 
తాజాగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో తమ బృందం సేకరించిన అభిప్రాయాలకు.. వచ్చిన ఫలితాలకు పొంతనలేదన్నారు. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. 
 
ప్రజలకు తెలియని పార్టీలకు కూడా లక్షల ఓట్లు రావడంపై అనుమానం వ్యక్తం చేశారు. 'ఈవీఎంలు తారుమారయ్యాయని చెప్పాలని కొందరు నన్ను అడుగుతున్నారు. ఓడిన తర్వాత చేసే ఆరోపణలు ఇవి. దీనికి సంబంధించి నా దగ్గర ఆధారాలు లేవు. కానీ, చాలా విషయాలు సరిపోలడం లేదు. ప్రాథమికంగా ఏదో జరిగినట్లు నాకు అన్పిస్తోంది. అదేంటో తెలియదు' అని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు. 
 
కాగా, ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన అనంతరం రాష్ట్రంలోని మహిళలకు అధికార ఎన్డీయే కూటమి రూ.10 వేలు అందజేయడంపై ఆయన విమర్శలు చేశారు. ఓటమి నేపథ్యంలో తన రాజకీయ జీవితం ముగిసిందంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. బీహార్‌లో 243 అసెంబ్లీ సీట్లకు ఇటీవల ఎన్నికలు జరగ్గా.. ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 238 సీట్లకు ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయగా.. ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఓటమికి 100 శాతం తానే బాధ్యత తీసుకుంటానని ఆయన వెల్లడించిన విషయం తెల్సిందే.