గురువారం, 13 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 12 నవంబరు 2025 (17:37 IST)

కొదమసింహం రీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi, Kodamasimham
Megastar Chiranjeevi, Kodamasimham
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సక్సెస్, జానర్ పరంగా చూస్తే ఒక ప్రత్యేకమైనదిగా కొదమసింహం సినిమాను చెప్పుకోవచ్చు. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన "కొదమసింహం" సినిమాను ఈ నెల 21వ తేదీన 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్ తో సరికొత్తగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు రీ రిలీజ్ చేస్తున్నారు.

ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా "కొదమసింహం" రీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ చేశారు. వింటేజ్ మెగాస్టార్ స్టైల్, స్వాగ్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ, అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్...ఈ ట్రైలర్ లో మెస్మరేజ్ చేస్తున్నాయి. 4కే కన్వర్షన్ క్వాలిటీ, 5.1 డిజిటల్ సౌండింగ్ ట్రైలర్ ను రిపీటెడ్ గా చూసేలా ఉన్నాయి.
 
మెగాస్టార్ చిరంజీవి కౌబాయ్ గా నటించి ప్రేక్షకుల్ని అలరించిన "కొదమసింహం" సినిమాలో రాజ్ కోటి మ్యూజిక్, మోహన్ బాబు కామెడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. కె. మురళీమోహన రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ, సోనం, వాణీ విశ్వనాథ్  హీరోయిన్స్ గా నటించారు. ఈ నెల 21న "కొదమసింహం" రీ రిలీజ్ ఫస్ట్ షో చూసేందుకు మెగా ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.