బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)
కన్నబిడ్డల కళ్ళెదుటే తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పరిధిలో జరిగింది. భార్యా, భర్త, తమ ఇద్దరు పిల్లలతో కలిసి బైకుపై వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా, మిగిలినవారు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ చర్లపల్లి - ఉప్పల్ వైపు వెళుతుండగా జరిగింది.
నలుగురుతో వెళుతున్న బైకును హెచ్ఎంటీ నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బైకుపై భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొట్టగానే భార్య తన పిల్లల కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయింది. దీంతో భర్తతో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.