గురువారం, 27 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2025 (18:25 IST)

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Naveen polishetty, Meenakshi Chowdhury
Naveen polishetty, Meenakshi Chowdhury
నవీన్ పోలి శెట్టి నటించిన అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా పాట నవంబర్ 27న విడుదలవుతుంది. ఈ సాంగ్ ను ఆయనే ఆలపించారు. భీమవరంలోని SRKR ఇంజనీరింగ్ కళాశాలలో పాటల ఆవిష్కరణ కార్యక్రమానికి మాతో చేరండి. ఘనంగా జరుపుకుందాం అంటూ పోస్టర్ ను అభిమానులకోసం విడుదల చేశారు. ఇక సినిమా జనవరి 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రానుంది.
 
ఇంతకు ముందే విడుదల చేయాల్సి వున్నానవీన్ పోలిశెట్టి ఒక ప్రమాదంలో గాయపడటంతో విడుదల చేయలేదు. అందువల్ల, అతని కామెడీ ఎంటర్‌టైనర్ అనగనగ ఒక రాజు గణనీయంగా ఆలస్యం అయింది. ఈ చిత్రం చివరకు జనవరి 14, 2026న, సంక్రాంతి సందర్భంగా పెద్ద స్క్రీన్‌లపైకి వస్తోంది.
 
ఈ హాస్యభరితమైన ఎంటర్‌టైనర్ తాజా అప్‌డేట్ ప్రకారం, నవీన్ పాడిన మొదటి సింగిల్ ‘భీమవరం బాల్మ’ నవంబర్ 27న విడుదల కానుంది. ప్లేబ్యాక్ సింగర్‌గా మారడానికి నవీన్ ఎదుర్కొంటున్న కష్టాలను హాస్యభరితంగా చిత్రీకరించే సరదా ప్రకటన వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
 
మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగ వంశీ మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు.