మంగళవారం, 7 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఏపీలో కల్తీ మద్యం తయారీ కేసు : ఇద్దరు తెలుగుదేశం నేతలపై వేటు

tdp flag
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం తయారీ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అధికార టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు హస్తం ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. దీంతో ఆ ఇద్దరు నేతలపై సస్పెన్షన్ వేటు వేసింది. 
 
ఈ కల్తీ మద్యం తయారీ కేసులో సంబంధం ఉన్నట్టు తేలిన తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి, స్థానిక టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ఆదివారం రాత్రి ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
అలాగే, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. పార్టీ అధినేత నారా చంద్రబాబ నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. నకిలీ మద్యం తయారీ కేసులో జయచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాజేష్, సన్నిహితుడు జనార్ధన్ రావు, సమీప బంధువుల పాత్ర ఉన్నట్టు నిర్ధారణ కావడంతో వారి ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై టీడీపీ అధిష్టానం చర్యలు చేపట్టింది.