బుధవారం, 19 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 18 నవంబరు 2025 (22:53 IST)

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

Vanara sena - Film chamber.. letter
Vanara sena - Film chamber.. letter
వారణాసి టైటిల్ రిలీజ్ టైంలో దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వివాదాలకు తావిచ్చాయి. తాను దేవుడ్ని నమ్మను. మా ఆవిడ నమ్ముతుంది.. అంటూ వ్యాఖ్యలు చేయడం బాగానే వుంది. కానీ హనుమంతుడు దేవుడా? అసలు ఆయనెలా దేవుడయ్యాడు? అంటూ వ్యాఖ్యల చేయడంతో భజరంగ్ దళ్‌కు చెందిన రాష్ట్రీయ వానరసేవాసమితి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మత విశ్వాసాలను రెచ్చగొడుతున్నారనీ, ఆయన క్షమాపణ చెప్పాలని లేదంటే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు.
 
ఇదిలా వుండగా, ఇప్పటికే హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై కొనసాగుతున్న వివాదం. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదుతోపాటు తాజాగా సినిమా టైటిల్ వారణాసిపై ఫిల్మ్ ఛాంబర్‌లో మరొక ఫిర్యాదు అందింది. ఈ టైటిల్‌ని తాము ముందే రిజిస్టర్ చేశామని వెల్లడించింది రామభ‌క్త హ‌నుమ క్రియేష‌న్స్ బ్యానర్. దీనితో రాజమౌళి కావాలనే వివాదాలను తీసుకువస్తున్నారా? అనేది కూడా వినిపిస్తుంది.