యువతిని తాకరాని చోట తాకిన అకతాయి.. దేహశుద్ధి చేసిన ప్రజలు
ఏపీలోని అనంతపురం జిల్లాలో మద్యం మత్తులో ఓ యువతిని వేధించిన అకతాయికి ప్రజలకు దేహశుద్ధి చేశారు. పైగా, బాధిత యువతితో కూడా చెప్పుతో కొట్టించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనంతపురం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డులో స్కూటీపై వెళుతున్న ఓ యువతిని పీకల వరకు మద్యం సేవించిన యువకుడు తాకరాని చోట తాకి వేధించాడు. దీన్ని గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని చితకబాదారు.
నిందితుడి స్నేహితులు అక్కడకు చేరుకుని ఎదురుదాడికి దిగినప్పటికీ స్థానికులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చితకబాదారు. పైగా, యువతితో కూడా చెప్పుతో కొట్టించారు. చివరకు పోలీసులు రావడంతో ఈ సంఘటన సద్దుమణిగిపోయింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.