శనివారం, 22 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 21 నవంబరు 2025 (17:39 IST)

అటువైపు ఎమర్జెన్సీ వార్డులో రోగులు, ఇటువైపు కాబోయే భార్యతో వైద్యుడు చిందులు (video)

doctor dancing with his fiancee
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీలో ఓ వైద్యుడు తన కాబోయే భార్యతో ఒళ్లు మరిచి చేసిన నృత్యం కాస్తా వైరల్ అయ్యింది. వార్డులో రోగులుకి సంబంధించి ఆసుపత్రిలో చికిత్స చేయాల్సింది పోయి ఇలా కాబోయే భార్య అని చెప్పబడిన యువతితో నృత్యం చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ఏదైనా వుంటే ఇంట్లో చేసుకోవాలి కానీ ఇలా ఏకంగా ఆసుపత్రి గదినే బెడ్రూంగా మార్చేస్తారా అంటూ మండిపడుతున్నారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో విషయం ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీనితో వైద్యుడి గురించి ఆరా తీయగా... వకార్ సిద్దిఖీ అనే వైద్యుడు ఎమర్జెన్సీ వార్డులో వైద్యం చేసేందుకు గాను రెండేళ్ల కాంట్రాక్ట్ పద్ధతిలో ఆసుపత్రిలో చేరాడు.
 
ఐతే బుధవారం నాడు ఓ యువతి రాగానే అతడు పైఅంతస్తులో వున్న గదికి ఆమెను తీసుకుని వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి నృత్యం చేయడం ప్రారంభించారు. ఇది కాస్తా సిసి కెమేరాలో రికార్డయ్యింది. దీనిపై డాక్టర్ వకార్ సిద్ధిఖీని వివరణ కోరినప్పటికీ సరైన సమాఛధానం రాలేదు. దాంతో అతడిని అత్యవసర సేవల నుంచి తొలగించడమే కాకుండా తక్షణమే అతడు నివాసం వుంటున్న గదిని కూడా ఖాళీ చేయించారు.