గ్యాంగ్ రేప్ చేసి బయటే తిరుగుతున్నాడు.. యువతి ఆవేదన (వీడియో)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ మహిళ న్యాయం కోసం రోడ్డెక్కింది. తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులు బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై ఆమె డీఐపీని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది.
యూపీలోని మీరట్ నగరంలో ఓ మహిళపై ఆరుగురు కామాంధులు కొద్దిరోజుల క్రితం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాధితురాలు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఐజీని కల్సి ఆమె తన గోడు వెళ్లబోసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సర్.. కొంతకాలం క్రితం నాపై ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. నిందితుల్లో నలుగురు జైల్లో ఉన్నారు. ఇద్దరు ఇంకా పరారీలో ఉన్నారు. వారు నా సోదరుడుని చంపుతామని బెదిరిస్తున్నారు అని వాపోయింది. దీనిపై డీఐజీ విచారణకు ఆదేశించారు. అంతకుముందు డీఐజీని కలవడానికి బాధితురాలు ప్రయత్నిస్తే ఇన్‌స్పెక్టర్ పంకజ్ ఆమెను అడ్డుకున్నారు.