Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ
నటీనటులు : ప్రియదర్శి పులికొండ, ఆనంది, సుమ కనకాల, వెన్నెల కిషోర్ తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్ : విశ్వనాథ్ రెడ్డి, సంగీత దర్శకుడు : లియోన్ జేమ్స్, నిర్మాతలు : జాన్వీ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు, దర్శకుడు : నవనీత్ శ్రీరామ్
కథ:
పెండ్లి సంబంధాల్లో తిరస్కరించబడ్డ మధుసూదనరావు (ప్రియదర్శి), రమ్య (ఆనంది) వారి వారి కుటుంబంతో పెళ్ళిల్ల పేరయ్య సలహాతో ఓ పెండ్లికి హాజరవుతారు. అక్కడ ఇరు కుటుంబాలకు పిల్లలు నచ్చడంతో వివాహం జరుగుతుంది. అయితే కొద్దికాలం తర్వాత మధు చేసే ఉద్యోగం గురించి తెలుసుకుని షాక్ అవుతుంది. అతన్ని వదిలించుకోవాలని డిసైడ్ అవుతుంది. కానీ మధు ఒక్క చివరి అవకాశం కోరుతాడు. దాంతో బాగా ఆలోచించిన రమ్య తను కూడా నీ ఉద్యోగానికి హెల్ప్ చేస్తానని ట్విస్ట్ ఇస్తుంది. మరోవైపు వారుండే జూబ్లీహిల్స్ ఏరియా పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ ఆశా మేరీ (సుమ) వీరి జీవితంలో ఎలా ప్రవేశించింది? అసలు మధు చేసే ఉద్యోగం ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
ఈ సినిమా ప్రారంభం నుంచి అరగంటపాటు చాలా సరదాగా సరికొత్తగా అనిపిస్తుంది. కానీ కథలోని అసలు పాయింట్ రిలీవ్ చేసేసరికి కథంతా చెడిపోయినట్లు అనిపించింది. ప్రేమంటే ఎలా వుండాలి. ప్రేమికులు ఏవిధంగా మలుసుకుకోవాలని ఎన్ని సూక్తులు చెప్పినా అవి ప్రేక్షకుడికి రుచించవు. కొడుకు స్పేర్ పార్ట్ దుకాణాన్ని పెట్టుకున్నాడని దానితో వచ్చిన రాబడి చాలక తండ్రి అనారోగ్యం, దానికోసం రుణం చేయడం, అప్పిచ్చిన వాడు ఇల్లు జప్తు చేయడం వంటి సినిమా కష్టాలన్నీ దర్శకుడు ఇందులో రాసుకున్నాడు. ఆ అప్పును తీర్చడానికి హీరో చేసే ప్రవ్రుత్తి తో కథ గాడి తప్పింది. అయినా దాన్ని సాగదీసి సినిమాటిక్ గా దర్శకుడు చూపించడం, పోలీసులకు దొరక్కుండా తిరగడం వంటివన్నీ చాలా సిల్లీగా వుంటాయి.
ఇలాంటి కథను తీసిన నిర్మాతను అభినందించాల్సిందే. దర్శకుడు కథ చెప్పగానే అంగీకరించిన నటీనటులకు కూడా భుజం తట్టాలి. మొత్తంమీద ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సుమ కనకాల పోలీస్ ఎపిసోడ్ తోపాటు జబర్ దస్త్ బ్యాచ్ నైట్ పెట్రోలింగ్ కాస్త ఆటవిడుపుగా వుంటుంది. మధ్యలో కథనం అంతా ఓ డ్రామాగా సాగుతుంది.
నటీనటులపరంగా అందరూ బాగా యాక్ట్ చేశారు. స్క్రీన్ పై మంచి కెమిస్ట్రీతో హీరో హీరోయిన్లు కనిపించారు. సుమ చాలా కాలం తర్వాత నటిగా మెరిసింది. కేవలం విడాకులను ఇప్పించే కేసులనే డీల్ చేసే సుమకు చివరి వరకు అలాంటి కేస్ రాదు. కానీ చివరిలో వచ్చిన ఓ కేసు ఏవిధంగా డీల్ చేసిందనేది సారాంశం. సిల్లీ పాయింట్ తో దర్శకుడు సాసుకున్న కథకు తన శైలిలో న్యాయం చేశాడనే చెప్పాలి.
సాంకేతికపరంగా చూస్తే, విశ్వంత్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. అలాగే లియోన్ జేమ్స్ సంగీతం ప్లెజెంట్ గా ఉంది. రాఘవేంద్ర తిరున్ ఎడిటింగ్ ఫస్టాఫ్ లో బాగుంది. సెకండాఫ్ లో కూడా ఇలానే మైంటైన్ చేసి ఉంటే బాగుండేది. దర్శకుడు పూర్తి స్థాయిలో రాసుకున్న కథను క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేయడంలో తడబడ్డారు అని చెప్పక తప్పదు. మెయిన్ గా సెకండాఫ్ ని బెటర్ గా మైంటైన్ చేయాల్సింది. సో తన వర్క్ పర్లేదు అని చెప్పొచ్చు కానీ ముందు సినిమాలకి బెటర్ చేసుకోవాలి. లాజిక్స్ లాంటివి పక్కన పెట్టి కేవలం కామెడీ కోసం సరదాగా టైంపాస్ గా సినిమా వుంటుంది. ఓటీటీ కోసమే తీసిన ఈ సినిమాను థియేటర్ రిలీజ్ కావాలి కనుక చేశారు.
రేటింగ్: 2/5