శనివారం, 22 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2025 (16:45 IST)

కృష్ణానదిలో పాములు కాదు.. అవి పామును పోలిన చేపలు

Snakes
Snakes
కార్తీక మాసంలో కృష్ణానదిలో పాములు కనిపించాయని ఇటీవల వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే కృష్ణానదిలో పాములు తిరగలేదని పామును పోలిన చేపలు కనిపించాయి. ఇప్పటివరకు మనం ఎన్నో రకాల చేపలు చూసి ఉంటాం. అయితే పామును పోలిన చేపలు కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద వేలాదిగా దర్శనమిచ్చాయి. వీటిని ఈల్‌ జాతి చేపలు అంటారు. ఇవి నీటిలో ఈదడంతో పాటు నేల మీదా పాకగలవు.
 
అయితే పవిత్ర కార్తిక మాసంలో స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో వందలాది నీటి పాములు తరలివచ్చాయని అనుకున్నారు. ఆలయ పరిసరాల్లోని కృష్ణా నది ప్రవాహంలో పాములు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న దృశ్యాలు అందరికీ షాకిచ్చాయి. కానీ ఇవి పాములు కావని చేపలని జాలరులు తేల్చారు.