సోమవారం, 24 నవంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 నవంబరు 2025 (10:35 IST)

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

ayodhya rama
నవంబర్ 25న శ్రీరామ జన్మభూమి ఆలయంలో జరిగే ధ్వజారోహణ కార్యక్రమానికి సన్నాహకంగా, ఆలయంలో  భారీగా పూల అలంకరణలతో వెలుగొందనుంది. ఈ పవిత్ర కార్యక్రమం కోసం అయోధ్యను ప్రకాశవంతం చేయడానికి దాదాపు 100 టన్నుల పుష్పాలను ఉపయోగిస్తారు.
 
ధర్మ ధ్వజ వేడుకకు సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయని ఆలయ పూజారి తెలిపారు. రాముడికి చాలా ఇష్టమైన పువ్వులను ఈ అలంకరణలో ఉపయోగిస్తున్నారు. ఆలయాన్ని, నగరాన్ని అలంకరించడానికి దాదాపు 100 టన్నుల పుష్పాలను ఉపయోగించారని ఆలయ పూజారులు తెలిపారు. 
 
అలాగే ఈ చారిత్రాత్మక క్షణంలో భాగం కావడం తమ అదృష్టమని అలంకరణలో పాల్గొన్న కార్మికులు అన్నారు. రాముని దర్శనం పొందడం తమ అదృష్టమని తాము భావిస్తున్నామని మరొక కార్మికుడు తెలిపారు. రామమందిర నిర్మాణం పూర్తయిందని, 25వ తేదీన ప్రధానమంత్రి మోదీ సందర్శిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.