సోమవారం, 24 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 24 నవంబరు 2025 (16:58 IST)

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

Heart Attack
తెలంగాణలోని నిర్మల్ జిల్లా బైంసాలో వరుసగా 24 గంటల వ్యవధిలో ఇద్దరు యువకులు గుండెపోటుకి గురై మరణించడం కలకలంగా మారింది. గణేష్ నగరుకి చెందిన 32 ఏళ్ల చందు పటేల్ ఆదివారం నాడు తీవ్ర గుండెపోటుకి గురై కుప్పకూలి చనిపోయాడు.
 
ఇదిలావుండగా సోమవారం నాడు మేదరిగల్లికి చెందిన 31 ఏళ్ల విశ్వనాథ్ తనకు ఛాతీలో అస్వస్థతగా వుందని అన్నాడు. అతడిని చికిత్సకు తరలించేలోపుగానే మరణించాడు. దీనితో వరుస గుండెపోటులతో బైంసా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆమధ్య బెంగళూరులో కూడా ఇలాగే వరుసగా గుండెపోటుకి గురై పలువురు మరణించారు.