మంగళవారం, 25 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 24 నవంబరు 2025 (18:12 IST)

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Vijay Sethupathi, Puri Jagannath
Vijay Sethupathi, Puri Jagannath
విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్  క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్  పాన్-ఇండియా ప్రాజెక్ట్ #పూరిసేతుపతి  షూటింగ్ పూర్తయింది. ఇంటెన్స్ మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రారంభమైన ఈ చిత్రం చిత్రీకరణ చివరి రోజు పూరి, విజయ్ సేతుపతి, చార్మీ కౌర్ మధ్య  ఎమోషనల్ మూమెంట్స్ కి సంబధించిన వీడియోను టీం విడుదల చేసింది.
 
వీడియోలో, పూరి, మొత్తం యూనిట్‌తో కలిసి పనిచేయడాన్ని తాను ఎంతగా మిస్ అవుతున్నానో విజయ్ సేతుపతి తెలియజేస్తూ, ఈ ప్రయాణాన్ని  మెమరబుల్, ఆనందకరమైన అనుభవంగా చెప్పారు. పూరి, చార్మీ తమ భావాలను పంచుకున్నారు.  షూటింగ్ సమయంలో ఏర్పడిన బాండింగ్ ని తెలియజేశారు. విజయ్, పూరి జాకెట్‌ చాలా బావుందని అభినందించడం ఫేర్ వెల్ కు ఫన్ టచ్ ని జోడించింది.
 
ఈ చిత్రాన్ని  జెబి  మోషన్   పిక్చర్స్‌  జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలలో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బ్రహ్మాజీ , విటివి గణేష్ హిలేరియస్  పాత్రల్లో కనిపిస్తారు.
 
 మొత్తం షూటింగ్ పూర్తయినందున, చిత్ర బృందం ప్రమోషన్‌లను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,  హిందీ ఐదు భాషలలో విడుదలకు సిద్ధమవుతున్నందున ఈ సిమిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలో రిలీజ్ చేయనున్నారు.