సోమవారం, 24 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 నవంబరు 2025 (15:37 IST)

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

Jagan_KTR
Jagan_KTR
గత 24 గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య చాలా ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. 
 
ఈ సందర్భంగా కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో జగన్‌తో ఉన్న చిత్రాన్ని కూడా పంచుకున్నారు. ఆయనను "జగన్ అన్నా" అని ప్రేమగా సంబోధించారు. ఇది వారి ఇద్దరి మధ్య పెరుగుతున్న బంధాన్ని సూచిస్తుంది. ఇది ఆంధ్ర, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 
 
మరోవైపు ఏపీ, తెలంగాణ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిల మధ్య సమావేశం జరిగింది. సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్- తెలంగాణ జంట తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు  పుట్టపర్తిలో సమావేశమయ్యారు. 
Chandra Babu_ Revanth Reddy
Chandra Babu_ Revanth Reddy
 
ఆదివారం రాత్రి జగన్, కేటీఆర్ మధ్య జరిగిన సమావేశం జరిగిన కొన్ని గంటల తర్వాత ముఖ్యమంత్రుల మధ్య ఈ అధికారిక బహిరంగ సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్ర రాజకీయాల మధ్య జరిగిన క్రాస్ఓవర్, జగన్-కేటీఆర్, చంద్రబాబు-రేవంత్ రెడ్డిల మధ్య జరిగిన సమావేశాలు ఇప్పుడు అనేక చర్చలకు కేంద్ర బిందువుగా మారాయి.