సంబంధిత వార్తలు
- నవంబర్ 26 నుంచి 17 ఫిబ్రవరి 2026 వరకూ శుక్ర మౌఢ్యమి, శుభకార్యాలకు బ్రేక్
- సమాధిలోని దీపపు కాంతిలో దేదీప్యమానంగా వీరబ్రహ్మేంద్రస్వామి
- శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే
- దాంపత్య జీవితం సుఖమయం కావాలంటే ఇలాంటి స్నానం చేయాలట
- శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జీవ సమాధికి ప్రవేశించుటకు ముందు రోజు రాత్రి ఏం జరిగింది?
సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
నటరాజస్వామిగా ఆయన సమస్త విద్యలకు ఆలవాలం. చేతిలో ఢమరుకం పట్టుకుంటాడు. అందులోంచే మహేశ్వర సూత్రాలు, వ్యాకరణం, శబ్దరాశి వచ్చాయి. సమస్త విద్యలూ పరమశివుని ఆధీనమై ఉంటాయి. అటువంటి పరమశివునికి ఒక కోరిక ఉండేది. నాకొక అపురూపమైన సత్కారం జరగాలి. ఏమిటా సత్కారం-పుత్రాదిచ్చేత్ పరాజయం- ఒక మహా విధ్వాంసుడైన తండ్రికి జరగాల్సిన సత్కారమేమంటే తన కొడుకు చేతిలో ఓడిపోవడం. తన కన్న కొడుకు చేతిలో తాను ఓడిపోతే అబ్బా ఇదిరా సత్కారం... అని పరవశించిపోతాడట. తండ్రికన్నా అధికుడైనవాడు పుడితే ఆయన చేతిలో మరణిస్తానన్నాడు- శూర పద్మాసురుడు.
అందుకే ప్రణవానికి రహస్యం. ప్రణవ విశేషం చెప్పవలసివస్తే స్వామినాధన్‌గా వెలసిన క్షేత్రంలో తండ్రి అయిన పరమశివుణ్ణి పిలిపించి, నాన్నగారు.. చెప్పవలసినవాడు పైనుండాలి. వినవలసిన వాడు కిందుండాలని తండ్రిని కింద కూర్చోబెట్టి , ప్రణవ రహస్యాన్ని చెప్పాడు స్వామి. అబ్బ.. నేను చెప్పిన దానికన్నా గొప్పగా చెప్పాడురా.. ఇవాళ నా కొడుకు పొందిన జ్ఞానానికీ, నాకన్నా గొప్పగా చెప్పిన తీరుకూ నేను మురిసిపోతున్నానన్నాడు పరమశివుడు. కాబట్టి పరమ శివుణ్ణి సంతోషపెట్టిన మూర్తి సుబ్రహ్మణ్యుడు.
ఇక ఆయన శక్తి అంతా అమ్మవారే.. ఆయన రూపమంతా అమ్మవారే. ఆయన మంత్రం ఆరక్షరాలతో అమ్మవారే. ఆయన పుట్టింది అమ్మవారి శరీర రూపమైన శరవణతటాకం లోంచే. ఇన్ని అమ్మవారి పోలికలు కలిసి ఉన్న కారణం చేత, పార్వతీదేవికి ఎనలేని ప్రీతిపాత్రుడు. అందుకే పార్వతీపరమేశ్వరులు కూర్చొని ఉంటే, ఎప్పుడూ అమ్మవారి తొడమీద కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. అలాంటి సుబ్రహ్మణ్యునికి నమస్కరించినా, రెండు పువ్వులు అర్పించినా, సుబ్రహ్మణ్య నామం చెప్పినా, దేవాలయానికి వెళ్ళినా, ప్రదక్షిణం చేసినా ఆయన విశేషమైన అనుగ్రహాన్ని వర్షిస్తాడు. అంత గొప్ప స్వరూపం శ్రీ సుబ్రహ్మణ్యస్వామిది.
