ఆదివారం, 7 డిశెంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-12-2025 శనివారం ఫలితాలు- రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికంగా బాగుంటుంది. విలాసాలకు వివరీతంగా ఖర్చుచేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. కొత్త పనులు చేపడతారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. చెల్లింపుల్లో జాగ్రత్త. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు, స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు సంకల్పసిద్ధి ప్రధానం. ధైర్యంగా యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అపరిచితులతో జాగ్రత్త మితంగా సంభాషించండి. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్నివిధాలా అనుకూలం. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనలతో సతమతమవుతారు. పనులు సానుకూలమవుతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గుట్టుగా మెలగండి. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ప్రయాణం తలపెడతారు 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కలిసివచ్చే సమయం. ధైర్యంగా ముందుకు సాగుతారు. అవకాశం దక్కించుకుంటారు. ఆర్థికపరంగా మంచి ఫలితాలున్నాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడికి గురవుతారు. శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అధికం, ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. పరిచయస్తులతో సంభాషిస్తారు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త అప్రమత్తంగా ఉంచాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
విశేష ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ కృషి ఫలిస్తుంది. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. ధనలాభం ఉంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. సంకల్ప బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని ఖర్చుకుంటాయి. అందరితోను మితంగా సంభాషించండి. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధకులకు ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అనుమానాలు, అపోహలకు గురికావద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. చిన్న విషయానికే చికాకు పడతారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలకు స్పందిస్తారు. పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. ఖర్చులు విపరీతం వేడుకకు హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలేసి వెళ్లకండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు చురుకుగా సాగుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.