1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. JD Vance on 2028 run: I'm not a future potential candidate

భవిష్యత్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిని కాదు.. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్‌ను మాత్రమే : జేడీ వాన్స్

jd vaans
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను అమెరికా భవిష్యత్ అభ్యర్థిని కాదనని ప్రస్తుత ఉపాధ్యక్షుడు మాత్రమేనని చెప్పారు. పైగా, వైట్‍హౌస్‌లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. దీంతో విదేశాంగ విధానాలకు ఆయన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో 2028లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికలను కూడా వాన్స్‌ వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను భవిష్యత్తు అధ్యక్ష అభ్యర్థిని కాదని, ప్రస్తుత ఉపాధ్యక్షుడినని వ్యాఖ్యానించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే 2028 అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం కొంతకాలంగా వాన్స్‌కు మార్కో రూబియోతో తెర వెనుక రహస్య పోటీ జరుగుతోందని మీడియా వర్గాలు వెల్లడించాయి.  
 
వాన్స్ తన నిర్ణయాలను మార్చుకోవడానికి అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఇటీవల క్యాబినెట్ నుంచి వైదొలగడం కూడా ప్రధాన కారణమని మీడియా కథనాలు వెల్లడించాయి. అమె పదవి నుంచి దిగిపోవడం వల్ల విదేశీ వ్యవహారాల విషయంలో వ్యూహాలను పంచుకోవడానికి అనుభవజ్ఞులైన అధికారులు లేకుండాపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్‌తో యుద్ధం విషయంలోనూ వాన్స్‌ ట్రంప్‌ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లు.. యుద్ధాన్ని ముగించాలని సూచిస్తున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. 
 
ఇరాన్‌పై యుద్ధం గురించి ఇటీవల వాన్స్‌ మాట్లాడుతూ.. అందరికీ అణ్వాయుధాలు కావాలనుకుంటే ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడుతుందన్నారు. ఈ క్రమంలోనే విదేశాంగ నిర్ణయాలపై వాన్స్ అనుసరిస్తున్న విశ్లేషణాత్మక విధానాలపై ట్రంప్‌ అసహనంగా ఉన్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇరాన్‌ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ట్రంప్‌ ఆ దేశంపై దాడుల ప్రణాళికలను పంచుకుంటున్నట్లు పేర్కొన్నాయి. 
About Writer
ఠాగూర్