1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 11-12-2025 Daily Astrology

11-12-2025 గురువారం ఫలితాలు - జూదాలు.. బెట్టింగులకు పాల్పడవద్దు...

simharashi-5
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలతో సతమతమవుతారు. ఒత్తిడికి గురికావద్దు. పరిస్థితులు చక్కబడతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థలెదుర్కుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ఖర్చులు సామాన్యం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. రావలసిన ధనం అందుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి. లావాదేవీలతో సతమతమవుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు విపరీతం. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఉత్సాహంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఖర్చులు విపరీతం. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అపరిచితులతో జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ వాక్కు ఫలిస్తుంది. అనుకున్నది సాధించే వరకు పట్టుదలతో శ్రమించండి. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. నోటీసులు అందుకుంటారు. ప్రయాణం కలిసివస్తుంది.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలహా తీసుకోండి. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మందకొడిగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సర్వత్రా అనుకూలంగా ఉంది. లక్ష్మాన్ని సాధిస్తారు. హామీలు నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. కొత్తయత్నాలు చేపడతారు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మీ సమర్ధతపై నమ్మకం సన్నగిల్లుతుంది. నిస్తేజానికి లోనవుతారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. రుణసమస్య కొలిక్కివస్తుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆప్తులతో సంభాషిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు.
About Writer
రామన్
తర్వాతి కథనం
Guruvar Vrat: బృహస్పతిని గురువారం పూజిస్తే నవగ్రహ దోషాలు మటాష్